గడ్డపార గ్యాంగ్ అరెస్ట్.. వివరాలు వెల్లడించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ
కామారెడ్డి, 9 డిసెంబర్ (హి.స) ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర గడ్డపార గ్యాంగ్ను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 11 తులాల బంగారం, 22 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీన
కామారెడ్డి ఎస్పి


కామారెడ్డి, 9 డిసెంబర్ (హి.స)

ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర గడ్డపార గ్యాంగ్ను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 11 తులాల బంగారం, 22 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గత నాలుగు నెలలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది దొంగతనాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ను చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2న చిట్యాల గ్రామంలో మసులా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి, ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా.. నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ పాక్షికంగా లభించింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande