
మహబూబ్నగర్, 9 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పోటీ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, ఎవ్వరూ బెదిరింపులు, బలవంతపు చర్యలు, గొడవలకు పాల్పడరాదని, రాత్రుళ్ళు గుంపులు గుంపులుగా తిరగడం, ఓటు కోసం మద్యం సేవించడం, ఓటును అమ్మడం, కొనడం చట్టపరంగా పెద్ద నేరమని ఆమె తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు