
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో
మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. . ఇప్పటి వరకు 251 కోట్ల ప్రయాణాలు (ట్రిప్స్) జరిగాయని వాటి మొత్తం విలువ రూ.8,459 కోట్లని తెలిపారు.ఈ పథకం ద్వారా కుటుంబ బంధాలు పెరగడం, దేవాలయాల సందర్శన, ఆసుపత్రులకు చికిత్స, విద్యా వ్యవస్థలో పాల్గొనడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వంటి అనేక రకాలుగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..