ఇండిగో సంక్షోభంపై మోదీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{fon
Modi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలని.. ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీయే పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు (PM Modi On Indigo Crisis).

‘‘ప్రభుత్వం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. నియమనిబంధనలు మంచివే. అయితే వ్యవస్థను మెరుగుపర్చేందుకు వాటిని రూపొందించాలి. అవి ప్రజలను వేధించకూడదు’’ అని ప్రధాని మాటలను కేంద్ర మంత్రి గుర్తుచేసుకున్నారు. ‘‘సామాన్య పౌరుల్ని ఇబ్బందిపెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టంగా చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా పరిణమించకూడదు’’ అని వెల్లడించారు. వారం రోజులకు పైగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాంతో రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దు, ఆలస్యమవుతున్నాయి. దాంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ ఇబ్బందిపడుతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande