జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి, 9 డిసెంబర్ (హి.స.) స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆకాక్షించారు. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంలో భాగంగా మంగళవారం కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి తెలంగాణ తల్లి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్


రంగారెడ్డి, 9 డిసెంబర్ (హి.స.)

స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆకాక్షించారు. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంలో భాగంగా మంగళవారం కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలి విడత తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మమేకం అయ్యారని గుర్తు చేశారు.

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అధికారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను, సాంస్కృతిక కళాకారులను ఘనంగా సన్మానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande