
తిరుపతి(, 9 డిసెంబర్ (హి.స.)
టీటీడీ కల్తీ నెయ్యి కేసు విచారణలో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సీబీఐ సిట్‌కు అవకాశం దక్కింది. వైసీపీ హయాంలో టీటీడీ ప్రొక్యూర్‌మెంటు జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, భోలేబాబా డెయిరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని నాలుగు రోజుల పాటు సీబీఐ సిట్ కస్టడీకి ఇవ్వడానికి సోమవారం నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మంగళవారం నిందితులిద్దరినీ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతికి తీసుకురానున్నారు. వీరి కస్టడీ పిటిషన్లను ఈ నెల 3న విచారించిన ఏసీబీ కోర్టు.. తీర్పును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ