మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
ముంబై, 9 డిసెంబర్ (హి.స.) బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంద
Gold Chains


ముంబై, 9 డిసెంబర్ (హి.స.)

బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌ 9వ తేదీన తులం బంగారం ధర రూ.1,30,430 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు 10 గంటల వరకు మరో సారి అప్‌డేట్‌ అవుతుంది. అప్పుడు ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,20,390 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,710 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,560 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande