వరంగల్ నగరంలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు.
వరంగల్, 9 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన నాకా బందీ (carden search) తనిఖీల్లో పోలీసులు భారీ ఎత్తున వాహనాలను తనిఖీ చేసి సరైన పత
వరంగల్ సిపి


వరంగల్, 9 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల

సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన నాకా బందీ (carden search) తనిఖీల్లో పోలీసులు భారీ ఎత్తున వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 173 వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి ఒక లక్ష 18 వేల రూపాయల మధ్యంతో పాటు మూడు లీటర్ల గుడుంబా, లక్ష యాభై వేల రూపాయల నగదు, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనంలో రవాణా చేస్తున్న 49వేల రూపాయల విలువ గల బాణాసంచాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande