నేటి అర్థరాత్రి నుంచి ఏపీ లారీ యజమానుల సంఘం సమ్మె
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)పాత వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం (Andhra Pradesh Lorry Owners Association) నేటి అర్ధరాత్రి (December 9) నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. దాదాపు 40 వేలకు పైగా సరకు రవాణా
strike


అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)పాత వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం (Andhra Pradesh Lorry Owners Association) నేటి అర్ధరాత్రి (December 9) నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. దాదాపు 40 వేలకు పైగా సరకు రవాణా లారీలు నిలిచిపోనున్నాయి. 13 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాహనాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఫిట్నెస్ ఛార్జీ పెరగడం వలన చిన్న తరహా సరకు రవాణా యజమానులపై పెను భారం పడుతుందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

​కేంద్రం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ అమలును నిలిపివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని పాత ఫిట్నెస్ చార్జీలనే కొనసాగించాలని లారీ యజమానులు కోరుతున్నారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలోని రైల్వే షెడ్లు, షిప్ యార్డుల నుంచి గూడ్స్ రవాణా పూర్తిగా నిలిచిపోనుంది. నిత్యావసర సరుకుల రవాణాకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande