రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో మహిళా లాయర్లకు 30% సీట్లు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్
Supreme Court HD


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.): ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రస్తుత ఏడాదికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేనట్లయితే 20శాతం సీట్లు వారికి కేటాయించి, మరో 10 శాతం సీట్లకు వారిని కో-ఆప్ట్‌ చేసుకోవాలని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందు ఉంచాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)కి తెలిపింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన బార్‌ కౌన్సిళ్లకు ఈ దశలో మహిళలకు సీట్లు కేటాయించాలనడం సరికాదని అభిప్రాయపడింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా ఆరు రాష్ట్రాల్లో బార్‌ కౌన్సిళ్లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని బీసీఐ ఛైర్‌పర్సన్‌ మనన్‌ కుమార్‌ మిశ్ర తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande