
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)
డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రంలో అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్ర (Atal Sandesh - Modi Suparipalana Yatra) జరగనుంది. ఈ మేరకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పకుండా యాత్రలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు (CM Chandra Babu) మాట్లాడుతూ వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలియజేవారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికిన నాయకులు వాజ్ పేయీ అని అన్నారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి పునాదులను వేశాయన్నారు.
సుపరిపాలన ఎలా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయీలను చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు వాజ్ పేయీతో మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏ సహాయం అడిగినా కాదనేవారు కాదని తెలియజేవారు. వాజ్ పేయీ హయాంలో టెలీ కమ్యూనికేషన్, విమానయాన రంగాల్లో సంస్కరణలకు నాంది పలికారని వివరించారు. ప్రజలకు పనొచ్చే పనుల విషయంలో, పాలసీల రూపకల్పనలో త్వరగా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినవారని, పట్టుదల, అనునిత్యం ప్రజలకు మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండేవారని సీఎం తెలియజేశారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV