కాంగ్రెస్‌ నుంచి సిద్దూ సతీమణి సస్పెన్షన్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} చండీగఢ్‌/ఢిల్లీ 09 డి
Congress Bihar Assembly Elections


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

చండీగఢ్‌/ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.): రూ.500 కోట్ల సూట్‌కేసు సమర్పించినవారే ముఖ్యమంత్రి అవుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, సిద్దూ సతీమణి నవ్‌జోత్‌ కౌర్‌ సిద్దూను పార్టీ సస్పెండు చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సోమవారం సాయంత్రం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రజా ప్రకటించారు. అయితే అంతకుముందు నవ్‌జోత్‌ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు.

నవ్‌జోత్‌ కౌర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త నవ్‌జోత్‌ సింగ్‌ సిద్దూను కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు. ఏ పార్టీకీ డబ్బులివ్వడానికి తమవద్ద లేవని, కానీ పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామని పేర్కొన్నారు. ‘మేం ఎప్పుడూ పంజాబ్, పంజాబీయుల గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం రూ.500 కోట్లు ఇవ్వడానికి మావద్ద లేవు’ అని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులివ్వాలని డిమాండు చేశారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చారు. కానీ ఎవరైతే రూ.500 కోట్ల సూట్‌కేసును ఇస్తారో వారే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆమె వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ తమ నుంచి ఏదీ అడగలేదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande