ఇండిగోపై కేంద్రం తొలి వేటు!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ల్లీ
INDIGO Flights


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ల్లీ 09 డిసెంబర్ (హి.స.)విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో ఐదు శాతం కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకూ తగ్గనున్నాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు మరిన్ని విమాన సర్వీసుల రద్దుకు దారితీయడం గమనార్హం.

నిన్న మొన్నటి వరకు ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 2200 సర్వీసులను నడిపేది. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో, తదితర సంస్థలు ఎన్నిసార్లు టేకాఫ్‌/ల్యాండింగ్‌లు జరిపేందుకు ఉన్న అనుమతుల సంఖ్యనే స్లాట్లు అంటాం. ఉదాహరణకు హైదరాబాద్‌ విమానాశ్రయంలో 24 గంటల సమయంలో ఇండిగోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుంటే.. ఆ సంస్థ ఈ సమయంలో యాభై చోట్లకు సర్వీసులు నడపవచ్చు. డీజీసీఏ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐదు శాతం స్లాట్లు తగ్గుతాయి కాబట్టి ఇకపై ఇండిగో హైదరాబాద్‌ నుంచి సుమారు 47 చోట్లకు మాత్రమే సర్వీసులను నడపగలదన్నమాట.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande