ఇండిగో సంక్షోభం.. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తనిఖీలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
IndiGo crisis


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)ఇండిగో సంక్షోభం (IndiGo crisis) ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రోజుల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నా వందల సంఖ్యలో విమానాలు ఇంకా రద్దవుతూనే ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి తనిఖీలు చేపట్టాలని (Nationwide Airport Inspections) సీనియర్‌ అధికారులకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాలను వ్యక్తిగతంగా సందర్శించి, విమానాల కార్యకలాపాలను పరిశీలించి, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ తనిఖీలలో భాగంగా ప్రయాణికులు లేవనెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది.

ఇండిగో సంక్షోభం వంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని.. ఎయిర్‌లైన్స్‌, విమానాశ్రయాల్లోని ఇతర అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యను త్వరగా కొంతమేరకు పరిష్కరించగలిగామన్నారు. ఇతర విమానయాన సంస్థలు విమాన ఛార్జీలను పెంచకుండా పరిమితులు విధించినట్లు తెలిపారు. సంక్షోభంపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు నివేదిక 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande