
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)భారతదేశంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 57.07 కోట్ల ఖాతాలు ఉన్నప్పటికీ, వాటిలో 15.09 కోట్లకు పైగా ఖాతాలు ప్రస్తుతం నిష్క్రియంగా (Inoperative) ఉన్నాయని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ కీలక సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం ద్వారా సభకు సమర్పించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం, ఒక పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా రెండేళ్ల కాలంలో కస్టమర్ తరపున ఎలాంటి లావాదేవీలు జరగకపోతే దానిని నిష్క్రియ ఖాతాగా డార్మెంట్ ఖాతాగా వర్గీకరిస్తారు. ఈ నిబంధనల ప్రకారం భారీ సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు నిద్రావస్థలోకి వెళ్లాయి. ఇది కేవలం ఖాతాదారులు వాటిని ఉపయోగించకపోవడం సూచిస్తుంది. పదేళ్ల పాటు క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న బ్యాలెన్స్‌లను, క్లెయిమ్ చేయని ఇతర మొత్తాలను బ్యాంకులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ