
ఢిల్లీ, 9 డిసెంబర్ (హి.స.)ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ‘శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ X హ్యాండిల్ ‘సోనియా గాంధీ నాయకత్వంలో అమలైన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం, విద్యాహక్కు చట్టం (RTE), సమాచార హక్కు చట్టం (RTI) వంటి సంక్షేమ చట్టాలను దేశం గుర్తు చేసుకుంది. ‘ఆమె జీవితం సమగ్రత, కరుణ, ధైర్యానికి ప్రతీకం.. జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV