
నెల్లూరు, 9 డిసెంబర్ (హి.స.)
నెల్లూరు జిల్లాలోని గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్ (Lemon Market) లో రైతులు దిగాలు పడుతున్నారు. పంట ఉత్పత్తికి దిగుబడి రాక ఆవేదన చెందుతున్నారు. వేలం కేజీ నిమ్మకాలు కేవలం 10 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయని వాపోతున్నారు. రెండు నెలల కిందట 30 రూపాయలకు కేజీ పలికిన కేజీ నిమ్మకాల ధరలు అకస్మాత్తుగా పడిపోవడంతో దిక్కు తోచని పరిస్థితికి చేరుకుంటున్నారు. మార్కెట్ లో నిమ్మకాయల పడిపోవడం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో పక్క పొదలకూరులోని హోల్ సేల్ దుకాణాలు కిలో 30 రూపాయలు, గూడూరులోని హోల్ దుకాణాలు 40 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు.
తమ వద్ద మాత్రం 10 రూపాయలకు కిలో కొనుగోలు చేస్తూ నష్టాపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని.. వ్యాపారుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని నిమ్మ రైతులు కోరుతున్నారు. రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిమ్మకాయల ధరలు పడిపోవడం పట్ల విస్మయాన్ని, ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ సమస్యల పరిష్కారం వహించిన రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతులు విన్నవిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV