
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ముంబై, 09డిసెంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంపై బుధవారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలకు కారణంగా కనబడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 102)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 800 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్ల నష్టంతో 84, 542 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 176 పాయింట్ల నష్టంతో 25, 784 వద్ద కొనసాగుతోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ