
పుదుచ్చేరి, 9 డిసెంబర్ (హి.స.)పుదుచ్చేరి రాజకీయాల్లోనూ తన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడి ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్పష్టం చేశారు. మంగళవారం పుదుచ్చేరిలో జరిగిన తన తొలి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో మన పార్టీ జెండా కచ్చితంగా ఎగురుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఈ సభను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప్పళం హార్బర్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేవలం 5,000 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రశంసించిన విజయ్, తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి వారిని చూసి నేర్చుకోవాలని చురక అంటించారు. ప్రజలే వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో పలుమార్లు తీర్మానాలు చేసినా పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV