దిల్లీ: 9 జూలై (హి.స.)యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియను దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని అత్యున్నత న్యాయస్థానానికి శుక్రవారం కేంద్రం తెలిపింది. నిమిష ప్రియ మరణశిక్ష తాత్కాలికంగా నిలిలిచిపోయిందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి తెలిపింది. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబాన్ని కలిసి చర్చించేందుకు ఓ ప్రతినిధి బృందాన్ని యెమెన్‌కు కేంద్రం పంపాల్సిందిగా పిటిషనర్ సంస్థ ‘సేవ్ నిమిష ప్రియ-ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో తమవైపు నుంచి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. ‘‘ప్రస్తుతానికి ఉరిశిక్ష నిలిపివేశారు. ఇప్పుడు బాధిత కుటుంబం నుంచి క్షమాపణ పొందాలి. ఆ తర్వాత బ్లడ్‌మనీ(క్షమాధనం) గురించి చర్చించాలి’’ అని ఆ న్యాయవాది పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ