బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్
హైదరాబాద్, 19 జూలై (హి.స.) మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ కలకలం రేపింది. మావోయిస్టుల పేరుతో దుండగులు రఘునందన్ రావుకు కాల్ చేసి అంతుచూస్తామని హెచ్చరించారు. కాగా మావోయిస్టుల పేరుతో రఘనందన్ రావుకు గతంలోనూ రెండుసార్లు బెదిరింపు కాల్స
రఘునందన్ రావు


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ కలకలం రేపింది. మావోయిస్టుల పేరుతో దుండగులు రఘునందన్ రావుకు కాల్ చేసి అంతుచూస్తామని హెచ్చరించారు. కాగా మావోయిస్టుల పేరుతో రఘనందన్ రావుకు గతంలోనూ రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత నెలలో ఫోన్ చేసిన దుండగులు ఆపరేషన్ కగార్ ఆపాలంటూ హెచ్చరించారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ దమ్ముంటే వచ్చాయని కాపాడుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే గతంలో వచ్చిన బెదిరింపు కాల్స్ పై రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులపై ఆయన రాష్ట్ర డీజీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలతో పాటు సిద్ధిపేట సీపీకి ఫిర్యాదు చేశారు. మావోయిస్టుల బెదిరింపులు ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande