దిల్లీ:9 జూలై (హి.స.) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.
ఈ బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ.. గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్‌లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్‌సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.
దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ