అన్యమతస్తులపై టీటీడీ వేటు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, 19 జూలై (హి.స.) టీటీడీలో అన్యమతస్తులపై సస్పెన్షన్ వేటు పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా.. స్పందిస్తూ.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మా డిమాండ్ ప్రకారం.. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయాల
బండి సంజయ్


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

టీటీడీలో అన్యమతస్తులపై సస్పెన్షన్ వేటు పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా.. స్పందిస్తూ.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మా డిమాండ్ ప్రకారం.. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయాలనే టీటీడీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇది ప్రారంభం మాత్రమే. తిరుమలలో ఇప్పటికీ వందలాది మంది హిందువులు కాని వారు పనిచేస్తున్నారు. అలాంటి వారికి పవిత్ర స్థలంలో స్థానం లేదు. వారిని వెంటనే తొలగించాలి. ఆలయ పవిత్రత విషయంలో రాజీ పడకూడదు అని రాసుకొచ్చారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande