ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్
హైదరాబాద్, 19 జూలై (హి.స.) ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం అనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ప్రతి విద్యార్థికి వివరించి
Ou లో ఉద్రిక్తత


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం అనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ప్రతి విద్యార్థికి వివరించి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నేటి నుండి 5 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా హైదరాబాద్ లోని బీఆర్ఎస్వీ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల గోదావరి నదిలో 200 టీఎంసీల నీటి వాటాను తెలంగాణ కోల్పోయే పరిస్థితిని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కరపత్రాల ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు వివరిస్తుండగా, పోలీసులు అడ్డుకుని విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande