హైదరాబాద్, 19 జూలై (హి.స.)
తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఏకే సింగ్ నేడు బాధ్యతలు స్వీకరించారు.. రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన సీజేగా ప్రమాణం చేసిన ఏకే సింగ్ కు అభినందనలు తెలియజేశారు.
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 1965 జూలై 7న డాక్టర్ రాంగోపాల్‌సింగ్, డాక్టర్ శ్రద్ధ సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత అయిన జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్