తిరుపతి, 19 జూలై (హి.స.)
:ఏపీలో అమానుష ఘటన జరిగింది. కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానంతో భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతి రూరల్‌లోని మంగళం రిక్షా కాలనీ పరిధిలో జరిగింది. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భార్య ఉషా(34)పై కోపంతో భర్త లోకేశ్వర్ హత్య చేశాడు. మృతురాలు అమర్ రాజా ఫ్యాక్టరీలో ఉద్యోగిని. ఉదయం 5 గంటలకు ఆమె డ్యూటీకి వెళ్తుండగా దారికాచి భర్త లోకేశ్వర్ హత్య చేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ