హైదరాబాద్, 19 జూలై (హి.స.)
నగరంలోని ఉప్పల్ స్టేడియం లో శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొత్త క్లబ్‌లకు సమావేశంలో కల్పిపించాలని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ (TCJAC) డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఉప్పల్ స్టేడియం ప్రధాన కార్యాలయంలో సమావేశానికి 173 క్లబ్ కార్యదర్శులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్స్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి వెళ్లారు. అయితే హెచ్‌సీఏలో మూడు వందల క్లబ్‌లకు అవకాశం ఇవ్వాలని గత కొంత కాలంగా తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరుతుంది. అయినా హెచ్‌సీఏ పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ ఉన్న 173 క్లబ్‌లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పింది. దీంతో ఆగ్రహించిన టీసీజేఏసీ సభ్యులు సమావేశాన్ని అడ్డుకోవడానికి స్టేడియం వద్దకు చేరుకున్నారు. సమావేశం నిర్వహిస్తున్న ఉప్పల్ స్టేడియం ప్రధాన కార్యాలయంలోకి దూసుకుపోవడానికి పలు మార్లు ప్రయత్నం చేశారు. అప్పటికే ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు వీరి ప్రయత్నాలను అడ్డుకుంది. దీంతో ఉద్రికత్తత చోటు చేసుకుంది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్