తెలంగాణ, మహబూబ్నగర్. 19 జూలై (హి.స.)
జూరాల ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతున్నది.. . ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నిన్న 18 గేట్లు ఎత్తివేసిన అధికారులు నేడు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ఇందులో స్పిల్‌వే ద్వారా 89,976 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,749 క్యూసెక్కులు, నెట్టెంపాటు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1400 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు