హైదరాబాద్, 19 జూలై (హి.స.)
రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
'రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.' అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..