తెలంగాణ, మెహబూబ్ నగర్ 19 జూలై (హి.స.) మహబూబ్నగర్ రూరల్ మండలం కొటకదిర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి 115వ ఆరాధన మహోత్సవాలు కోటకదిరలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సద్గురువు చూపిన మార్గంలో పయనిద్దామని సూచించారు. అంతకుముందు 20 లక్షల రూపాయల ముడా నిధులతో నిర్మించనున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో షెడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు