రామవరం లో ఇవాళ ఉదయం.భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
విశాఖపట్నం, 19 జూలై (హి.స.) :రామవరంలో ఇవాళ(శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదంచోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమ
రామవరం లో ఇవాళ ఉదయం.భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది


విశాఖపట్నం, 19 జూలై (హి.స.)

:రామవరంలో ఇవాళ(శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదంచోటుచేసుకుంది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande