మంచిర్యాల, 19 జూలై (హి.స.) గంజాయి రవాణా అమ్మకాలపై మంచిర్యాల జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా గాంధీ నగర్ లో శనివారం ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు కార్డెన్స్ సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శాంతి భద్రతల నిర్మూలనలో భాగంగా గంజాయి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గంజాయి, గుడుంబా విక్రయించినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. గంజాయి విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్