బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం : మంత్రి పొన్నం
తెలంగాణ, కరీంనగర్. 19 జూలై (హి.స.) బీసీ రిజర్వేషన్ల పై మా చిత్తశుద్ధిని శంకిస్తే మీకు పుట్టగతులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సకల జనుల సర్వే చేస్తే బొంబాయి, దుబ
మంత్రి పొన్నం


తెలంగాణ, కరీంనగర్. 19 జూలై (హి.స.)

బీసీ రిజర్వేషన్ల పై మా చిత్తశుద్ధిని శంకిస్తే మీకు పుట్టగతులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సకల జనుల సర్వే చేస్తే బొంబాయి, దుబాయ్ లో ఉన్న వాళ్ళు వచ్చిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే చేసిందని, సర్వే లో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. బీసీ ల మీద ప్రేమ ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును ఆమోదించుకుందాం రండి అని సూచించారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అడ్డంకులు వస్తే ఆర్డినెన్స్ తెచ్చి సవరిస్తున్నామని, బీసీ రిజర్వేషన్ల పై మా చిత్తశుద్ధి శంకిస్తే మీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బీసీ లకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని, కుల గణన మొదలు ఆర్డినెన్స్ వరకు చిత్తశుద్ధి తో పని చేస్తున్నామని, కానీ నడిచే వాళ్ళ కాళ్లలో కట్టే అడ్డంపెట్టినట్టు చేస్తున్నారని ఆరోపించారు. కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మరోలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ కుల సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande