హైదరాబాద్, 19 జూలై (హి.స.)
బషీర్ బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థుల శనివారం ఆందోళన దిగారు. నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపాల్, గత 20 రోజులుగా హాస్టల్ మూసి వేశారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. రోడ్డు పై విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..