హైదరాబాద్, 19 జూలై (హి.స.)
రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బెస్ట్ ఎవైలబుల్ స్కీమ్ కింద చదివే పిల్లలంతా పేద వర్గాలే వారేనని ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాల్లో పుట్టిన మెరికల్లాంటి పిల్లలకు, కార్పోరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ నిలిపేయాలని చూస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించడం ఇష్టం లేదా? కేవలం 150 కోట్ల బకాయిలు చెల్లించే స్థోమత లేదా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
అందాల పోటీలు, మహిళా శక్తి సంబరాలు, అక్రమ కేసులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిధులు ఉన్నాయి కానీ, పేద పిల్లల చదువులకు మాత్రం నిధులు లేవా? పేదలంతా ఓటేస్తేనే కదా మీరు ఆ సీట్లో కూర్చున్నది! అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్