జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
హైదరాబాద్, 19 జూలై (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తలపడుతున్నాయి. గతంలో కంటోన్మెంట్ ఉపఎన్నికల్
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తలపడుతున్నాయి. గతంలో కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో గెలిచిన తీరులో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ గెలుపు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థిని ప్రకటించక ముందే నియోజకవర్గంలో పలువురు కీలక నేతలు పర్యటించారు. కాలనీల్లో తిరుగుతూ, ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఇతర పార్టీ కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. క్రమంలోనే శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన సాగుతోందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande