అక్రమార్కుల పై ఉక్కుపాదం మోపుతాం : టౌన్ ప్లాన్ అధికారులు
హైదరాబాద్, 19 జూలై (హి.స.) నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల కొందరు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయడం జరిగింది. సదరు ఆక్రమణల పై ఫిర్యాదు అందుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక శ
టౌన్ ప్లాన్ అధికారులు


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని

కోకాపేటలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల కొందరు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయడం జరిగింది. సదరు ఆక్రమణల పై ఫిర్యాదు అందుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులతో ఆక్రమణదారులు దురుసుగా ప్రవర్తించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆక్రమణ దారులను పోలీసులు ఈడ్చి వేసి కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి మణి హారిక మాట్లాడుతూ ఎవరైనా ఆక్రమణలు చేపడితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నిబంధనల మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande