ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మందుల సామేల్
తెలంగాణ, సూర్యాపేట. 19 జూలై (హి.స.) ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ ముబారక్ చెక్కు
ఎమ్మెల్యే మందుల సామేల్


తెలంగాణ, సూర్యాపేట. 19 జూలై (హి.స.)

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా

ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande