నల్గొండ, 20 జూలై (హి.స.)
: అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాహనాల రాకపోకలను నియంత్రించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ