న్యూఢిల్లీ: 20 జూలై (హి.స.)భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో వారు సురక్షితంగా లేరని నిరంతరం తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి కథనాలు దేశానికి సాయం చేయవని ఆయన అన్నారు.
దేశంలో మైనారిటీ, మెజారిటీకి చెందిన వారెవరైనా కూడా చట్టం, రాజ్యాంగం ముందు అంతా సమానమే అని చెప్పారు. మెజారిటీ వర్గానికి ఏం లభిస్తుందో, మైనారిటీలకు కూడా అదే లభిస్తుందని తాను స్పష్టంగా చెప్పగలనని రిజిజు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ