రెంటపాళ్ళ ఘటనకు సంబంధించి వైసిపి నాయకురాలు. విడదల రజనికి పోలీసులు నోటీసులిచ్చారు
చిలకలూరిపేట, 20 జూలై (హి.స.) ,:రెంటపాళ్ల ఘటనలకు సంబంధించి.. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీకి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంట
రెంటపాళ్ళ ఘటనకు సంబంధించి వైసిపి నాయకురాలు. విడదల రజనికి పోలీసులు నోటీసులిచ్చారు


చిలకలూరిపేట, 20 జూలై (హి.స.)

,:రెంటపాళ్ల ఘటనలకు సంబంధించి.. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీకి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో గత నెలలో జగన్‌ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి భారీ ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్త సింగయ్య.. మాజీ సీఎం కారు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్యకర్తలు రెచ్చిపోయి.. వివాదాలకు దిగారు. ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి.. విచారణ రావాలంటూ విడదల రజినీకి చిలకలూరిపేటలోని నివాసంలో సత్తెనపల్లి పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఈ నోటీసులు అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande