మాచర్ల , 20 జూలై (హి.స.) మాచర్ల నియోజకవర్గం, పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో వైసీపీ అరాచకాల పై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని అన్నారు. పసుపు జెండా చేతబట్టి రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల పై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు ప్రతి కార్యకర్త, నాయకుడికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. శేషగిరిరావు లేకపోయినా మాచర్ల నియోజకవర్గంలో ఆయన చేసిన పోరాటం పార్టీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. శేషగిరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి