మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం
ఢిల్లీ, 20 జూలై (హి.స.)పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వే
మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం


ఢిల్లీ, 20 జూలై (హి.స.)పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నవి కాగా, 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి (Parliament Monsoon Session).

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం (All-party meeting) నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరవుతారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande