‘నీ పర్యటనలు అందుకేనా?’.. మాజీ సీఎం జగన్ పై యరపతినేని ఫైర్
అమరావతి, 20 జూలై (హి.స.)ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై దృష్టి పెట్టి తొలి అడుగు పేరుతో ప్రజలలోకి వెళుతున్నామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నార
‘నీ పర్యటనలు అందుకేనా?’.. మాజీ సీఎం జగన్ పై యరపతినేని ఫైర్


అమరావతి, 20 జూలై (హి.స.)ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై దృష్టి పెట్టి తొలి అడుగు పేరుతో ప్రజలలోకి వెళుతున్నామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ పాలనలో ఆర్ధికంగా పతనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. వైసీపీ పాలనలో రైతు సమస్యలు గాలికి వదిలేసి, గంజాయి సాగుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ శాఖను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని యరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైఎస్ జగన్‌కి కిలో, క్వింటాకు తేడా తెలుసా? అని దుయ్యబట్టారు. గంజాయిసాగు తప్ప వ్యవసాయం గురించి జగన్‌కు తెలియదని అన్నారు.

వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి చెంప చెళ్లు మనిపించిన.. ఇంకా రప్పా రప్పా అని ప్రజలను హింస పెట్టడానికి పర్యటనలు చేస్తున్నావా? అని మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. పేర్ని నాని మీకు దమ్ముంటే నరుకుతామనే వాళ్ళ పేర్లు చెప్పండి చాలు అని తెలిపారు. ప్రజలకు ఏం కావాలో కనుక్కోమని మా అధినేత ప్రజల చెంతకు పంపి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గురజాల నియోజకవర్గ పరిధిలో 1200 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande