విజయవాడ , 20 జూలై (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిన్న అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (Mithun Reddy Arrest) సిట్ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Vijayawada Government Hospital) తరలించారు. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరు పరిచి రిమాండ్ కు పంపనున్నారు.
మిథున్ రెడ్డి అరెస్టైన క్రమంలో సిట్ కార్యాలయానికి భారీ ఎత్తున వైసీపీ నేతలు తరలి వస్తున్నారు. తీవ్ర ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి