మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది
న్యూఢిల్లీ: , 20 జూలై (హి.స.)ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్
మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది


న్యూఢిల్లీ: , 20 జూలై (హి.స.)ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు.

‘‘బీజేపీ బీహార్ ను తాలిబాన్ గా మార్చింది! గయలో డాక్టర్ కాల్పులు. పాట్నాలో రెండు గ్రూపుల మధ్య బహిరంగ కాల్పులు. పాట్నాలో మహిళ కాల్పులు. రోహ్తాస్‌లో వ్యాపారవేత్త హత్య.’’ అంటూ ఎక్స్‌లో తేజస్వీ యాదవ్ ఒక పోస్ట్ పెట్టారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కారణమని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande