విజయవాడ, 20 జూలై (హి.స.)విజయవాడ(Vijayawada)లో కుండపోత వర్షం(Rain) కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపిలేని లేకుండా వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్డులపై నీళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని పలు కాలనీల్లోకి వర్షంపు నీరు చేరింది. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి