మోడీజీ, 5 యుద్ధ విమానాల గురించి నిజం చెప్పండి
న్యూఢిల్లీ: 20 జూలై (హి.స.)మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారిం
Sonia and Rahul Gandhi


న్యూఢిల్లీ: 20 జూలై (హి.స.)మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వినిడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.

అయితే, ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించారు. నిజాలను దేశ ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. ‘‘మోడీ జీ, ఐదు యుద్ధవిమానాల గురించి నిజం ఏమిటి..? దేశానికి తెలుసుకునే హక్కు ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande