టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు మృతి
మాచర్ల, 20 జూలై (హి.స.): మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరి రావు ఆదివారం ఉదయం మరణించారు. 2024లో జరిగిన ఎన్నికల పోలింగ్ నాడు రాష్ట్రం అంతా నంబూరి శేషగిరి రావు పేరు మారుమోగింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ లో నీ ఓ
టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు మృతి


మాచర్ల, 20 జూలై (హి.స.): మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరి రావు ఆదివారం ఉదయం మరణించారు. 2024లో జరిగిన ఎన్నికల పోలింగ్ నాడు రాష్ట్రం అంతా నంబూరి శేషగిరి రావు పేరు మారుమోగింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ లో నీ ఓ పోలింగ్ బూత్ లో నాటి వైసీపీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను పగులగొట్టారు. దానిని శేషగిరిరావు అడ్డుకున్నారు. అందుకు ప్రతిగా ఆయన పై ప్రత్యర్ధులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలయ్యారు.

నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఎం.పి.లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎం ఎల్ ఏ జూలకంటి బ్రహ్మనందరెడ్డి శేషగిరి రావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శేషగిరి రావు మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం తమ ఇద్దరిని బాధించిందన్నారు. మాచర్ల టీడీపీ పార్టీ ఓ సైనికుడిని , తాము మంచి ఆత్మీయుడిని కోల్పోయామని శ్రీ కృష్ణ దేవరాయలు, బ్రహ్మ రెడ్డి లు అన్నారు. ఓ శేషగిరిరావు మరణవార్త తెలుసుకున్న పలువురు కూటమి నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande