గాల్లో ఉండగానే మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం..
లాస్‌ఏంజెలెస్ , 20 జూలై (హి.స.)విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఓ విమానాన్ని (Flight) అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికా (America)లోని లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో
గాల్లో ఉండగానే మంటలు.. ప్రమాదంలో అమెరికా విమానం..


లాస్‌ఏంజెలెస్ , 20 జూలై (హి.స.)విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఓ విమానాన్ని (Flight) అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికా (America)లోని లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్‌లో నుంచి మంటలు వస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (US flight catches fire).

లాస్‌ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య తలెత్తింది. విమానం గాల్లో ఉండగానే ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే పైలెట్లు అప్రమత్తమై విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి లాస్‌ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande